WHAT'S NEW?
Loading...

అదిగో అదిగో / ఏటయ్యిందె గోదారమ్మ..

చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, బృందం

ఓం .. ఓం .. ఓం
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః

అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కధగా..
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత
వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురీ..

అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

రాం .. రాం .. రాం .. రాం

రామనామ జీవన నిర్నిద్రుడు
పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ
దర్శనమిచ్చెను మహావిష్ణువూ

సాససా నీదరి సానిదాప
గమ పాదనీ దామపా

త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆఆఅ...ఆఆ..ఆఅ...
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడూ

ధరణిపతియే ధరకు అల్లుడై..
శంఖచక్రములు అటు ఇటు కాగా..
ధనుర్బాణములు తనువై పోగా..
సీతాలక్ష్మణ సమితుడై..
కొలువు తీరె కొండంత దేవుడూ..

శిలగా మళ్ళీ మలచీ..
శిరమును నీవే నిలచీ..
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ

వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే.
విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే !

అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆలనా పాలనా లేక గోదారమ్మ ఒడ్డున ఆరుబయట నిలిచి ఉన్న రాములోరి విగ్రహాలకు గుడి కట్టించిన రామదాసు ఆ ప్రాంతాలకు మొదటి సారి వస్తుంటే.. ఆహా మా రాములోరికి మంచి రోజులొచ్చాయని గోదారమ్మ ఆనందంతో ఉలికిపాటుకు గురైందంట.. ఆ వైనమేంటో వివరించే ఈ జానపదం ఎంత హాయిగా ఉంటుందో.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్‌తేజ
గానం : దేవిశ్రీప్రసాద్,కీరవాణి,మాళవిక 

హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఆ ఆ ఆ


కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట
ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట
చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా

ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు

చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది
నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది
రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు ఊఊఊ

హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా

0 comments:

Post a Comment