WHAT'S NEW?
Loading...

కొండా కోనల్లో లోయల్లో..

చిత్రం : స్వాతి కిరణం (1992)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వాణీ జయరాం, కోరస్

కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ
ఈ కోయిలమ్మా
 
కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో

నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఆ.. ఉల్లాసాలె ఊరంగా హా..
ఉంగా ఉంగా రాగంగా అహ ఉల్లాసాలె ఊరంగా అహ
ఊపిరి ఊయలలూదంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా

కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఆ..
గోదారి గంగమ్మా సాయల్లో

ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగ
జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా
చెట్టుపుట్టా నెయ్యంగా  ఆ.. చెట్టాపట్టాలెయ్యంగా హా..
చెట్టుపుట్టా నెయ్యంగా అహ చెట్టాపట్టాలెయ్యంగా అహ
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగా సావాసంగా

కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఓఓ..
లోయల్లో సాయల్లో లోయల్లో సాయల్లో..
ఆఆఆఆఅ..ఆఆఆఆఆ....

0 comments:

Post a Comment