WHAT'S NEW?
Loading...

చిరునవ్వులోని హాయి..

చిత్రం : అగ్గి బరాట (1966)
సంగీతం : విజయా కృష్ణమూర్తి
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసే
నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసే

సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసే
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసే

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

నయనాల తారవీవే...నా రాజహంస రావే 
అహహ..ఆ..ఆ..ఆ..
నయనాల తారవీవే...నా రాజహంస రావే
నను చేరదీసి...మనసార చూసి.. పెనవేసి నావు నీవే
నను చేరదీసి...మనసార చూసి ..పెనవేసి నావు నీవే

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

పవళించు మేనిలోన...రవళించే రాగవీణ
పవళించు మేనిలోన...రవళించే రాగవీణ

నీలాలనింగి లోలోనపొంగి...కురిపించే పూలవాన
నీలాలనింగి లోలోనపొంగి...కురిపించే పూలవాన

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి
ఈ నాడు కలిగెనోయి

0 comments:

Post a Comment