WHAT'S NEW?
Loading...

ముక్కుపై ముద్దు పెట్టు..

చిత్రం : చందమామ (2007)
సాహిత్యం : సాయి శ్రీహర్ష
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
గానం : హరిచరణ్, సుజాత 

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయేట్టు
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయేట్టు
మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు 


మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు 
 
మత్తు మెడకు ఒక్క మొక్కజొన్న ముద్దు
గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు
బుగ్గ పండు కోరికేసే రౌడీ ముద్దు
కొంటె ఈడు కాజేసే కేడి ముద్దు 

కంత్రి ముద్దు జగజ్జంత్రి ముద్దు
కంత్రి ముద్దు జగజ్జంత్రి ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ ఆ ఆ 

ముక్కుపై ముద్దు పెట్టు... 

వగల నడుము మడత మీద వడ్డాణం ముద్దు
ఈ నాభి చుట్టూ వేడి సెగల సిగ్గాణం ముద్దు
ఓంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు 

అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు
అల్లసాని పద్య మంత ఆ అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆం
ధ్రా ముద్దు 
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ ఆ ఆ

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు ఆ ఆ ఆ
ముక్కుపై ముద్దు పెట్టు..

0 comments:

Post a Comment