చిత్రం : మాంగల్యబలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : శ్రీశ్రీ / కొసరాజు
గానం : మాధవపెద్ది, జిక్కి
చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన
చేసిన మేలు మరువలేను చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా
ఆడదాని బ్రతుకంటే తీగవంటిది
బగా నీరు పోసి పెంచకుంటె సాగనంటదీ
ఆడదాని బ్రతుకంటే తీగవంటిది
మగతోడు ఉంటేనే జోరుగుంటదీ
అది మూడు పూలు ఆరుకాయలవుతుంటది
చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన
చదువు సంధ్యాలేని చవటను గానోయ్
నీ చాతుర్యమంతా నేను కనిబెడితినోయ్
చదువు సంధ్యాలేని చవటను గానోయ్
మగవారి నాటకాలు విని యుంటినోయ్
వారి మోజులెంత బూటకాలొ తెలుసుకొంటినోయ్
చేసిన మేలు మరువలేను చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా
ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా
అబ్బా జంట జోలి లేకుండా జరుపుకొందువా
ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా
లోకులంటే కాకులనీ మర్చిపోదువా
ఈ లోకమంటె లెక్కలేక ఎగిరిపోదువా
చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన
ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్
నీ ఊహలోని కిటుకంతా విప్పి చూస్తినోయ్
ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్
సూటి పోటి మాటలన్నీ కట్టిపెట్టవోయ్
ఇంక చాటుమాటు చూపులన్నీ దాచిపెట్టవోయ్
చేసిన మేలు మరువలేను చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా
0 comments:
Post a Comment