చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం :
గానం : బాలు
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే
పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు
నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే
చిలకా పలకవే ఆ కిటికీ...
అందాల కిటికీలో ఉందొక్క చందమామ
అందాల కిటికీలో ఉందొక్క చందమామ
నెలవంక చల్లగానే లేదూ..
నిలువెల్ల వేడెంతో రేపిందిలే..
తాపాన్ని కాస్తా తగ్గించమంటా..
ముసినవ్వు నవ్వగానే
ముత్యాలూ రాలతాయి..
రవ్వంతా కనికరిస్తే
రతనాలే దొరుకుతాయి
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే..
నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా
నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా
నా వంకా ఓరచూపు చూడూ..
నీ చెంత నా గుండె వాలేనులే..
నీమీద ఒట్టూ నా జట్టుకట్టూ..
పాడాలీ భావగీతం
ఆడాలీ ప్రేమ నాట్యం
పొంగాలీ నిండు హృదయం
ఏలాలీ ప్రణయ రాజ్యం..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు
నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే..
0 comments:
Post a Comment