WHAT'S NEW?
Loading...
మిత్రులందరకూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే ఈ పర్వదినాన ఆ చిన్ని కన్నయ్య అల్లరులను వర్ణిస్తూ గానం చేసిన ఈ పాట విందామ. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : యశోదకృష్ణ (1975)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల 

చక్కని వాడే బలె టక్కరివాడే
చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే?
చక్కని వాడే బలె టక్కరివాడే

కొంటెకాయ పిల్లలను కూర్చుకున్నాడూ
గోకులమ్ములో చల్లగ దూరుకున్నాడూ
పాలుపెరుగు దించుకొని జతగాళ్ళతో పంచుకొని
పాలుపెరుగు దించుకొని జతగాళ్ళతో పంచుకొని
దొంగలాగ వెన్నముద్దలు మ్రింగి పొయ్యాడూ 
 
చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే

పడక మీద ఆలుమగల ప్రక్కనే చేరాడు
గడ్డానికి సిగకూ ముడి గట్టిగ కట్టేశాడు
చాటునుండి ఈలవేసి చప్పట్లూ చరిచాడు
పట్టబోతే దొరక్కుండ గుట్టుగ దాక్కున్నాడు 

చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే

కోడలి బుగ్గమీద గోరు గాట్లు పెట్టాడు
అత్తకు సైగచేసి వ్రేలు  పెట్టి చూపాడు
జుట్లు జుట్లు పట్టి గట్టి కేకపెట్టి
తిట్లు తిట్టుకోని కొట్లాడుతుంటే
ఇరుగు పొరుగు వాళ్ళ బిలిచి ఎకసక్కాలాడేడు    

చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే

దూడల మెడ పలుపు విప్పి ఆవుల కడ వదిలాడు
స్నానమాడు పడుచుల దడిసందున గని నవ్వాడు
దేవుని పూజలు చేస్తూ నైవేద్యం పెడుతుంటే
నేనే దేవుడనంటూ నోటి నిండ పటాడు
 
చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే

శ్రీకృష్ణ సత్య చిత్రంలోని ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, జానకి

ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
పిల్లనగ్రోవి పిల్లవాయువు
పిల్లనగ్రోవి పిల్లవాయువు
భలే భలే మధురం..అంతకు మించీ
ప్రియుని కౌగిలీ..ఎంతో ఎంతో మధురం

  

ఇన్నీ ఉన్నా సరసిజలోచన..
సరసన ఉంటేనె మధురాం
మనసిచ్చిన ఆ..అలివేణి
అధరం..మరీ మరీ మధురం
ప్రియా ప్రియా మధురం

ఏనాటి నా పూజాఫలమో
ఏజన్మలో పొందిన వరమో
అందరుకోరే శ్యామసుందరుడే
అందరుకోరే శ్యామసుందరుడే
నాపొందు కోరుట మధురం

  
సత్యా కృష్ణుల సరసజీవనం
సత్యా కృష్ణుల సరసజీవనం
నిత్యం నిత్యం మధురం..
ప్రతి నిత్యం అతి మధురం
ప్రతి నిత్యం అతి మధురం
ప్రియా ప్రియా మధురం

సవతులెందరున్నా..ఆ ఆ ఆ
సవతులెందరున్నా కృష్ణయ్యా
సత్యను వలచుట మధురం
భక్తికి రక్తికి లొంగని స్వామిని
కొంగున ముడుచుట మధురం
నా కడకొంగున ముడుచుట మధురం

   
ఈ భామామణి ఏమి పలికినా
ఈ భామామణి ఏమి పలికినా
ఔననుటే మధురం  
ఈ చెలి పలుకుల పర్యవసానం
ఇంకా ఇంకా..మధురం..
ప్రియా ప్రియా మధురం

నను దైవముగా నమ్మిన దానవు 
కడ కొంగున నను ముడువని దానవు 
చల్లని ఓ సతీ జాంబవతీ..ఈఈ..
చల్లని ఓ సతీ జాంబవతీ
నీ సాహచర్యమే మధురం 

ప్రాణ నాథా నీ పాద సేవలో 
పరవశించుట మధురం 
తరియించుటే మధురాతి మధురం

శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల 

ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ
ప్రియురాల సిగ్గేలనే
నీ మనసేలు మగవానిజేరి ఈ..ఈ
ప్రియురాల సిగ్గేలనే

నాలోన ఊహించినా..ఆ..ఆ
నాలోన ఊహించినా
కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ
నాలోన ఊహించినా 

  

ఏమి ఎరుగని గోపాలునికి
ప్రేమలేవో నేరిపినావు
 
ఏమి ఎరుగని గోపాలునికి
ప్రేమలేవో నేరిపినావు 

మనసు తీర పలుకరించి 
మా ముద్దు ముచ్చట చెల్లించవే

ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ
ప్రియురాల సిగ్గేలనే

ప్రేమలు తెలిసిన దేవుడవని విని
నా మదిలోనా కొలిచితిని

 ప్రేమలు తెలిసిన దేవుడవని విని
నా మదిలోనా కొలిచితిని

 స్వామివి నీవని తలచి నీకే
బ్రతుకె కానుక చేసితిని
 
నాలోన ఊహించినా..ఆ..ఆ
నాలోన ఊహించినా
కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..
నాలోన ఊహించినా..ఆ


సమయానికి తగు మాటలు నేర్చిన
సరసురాలవే ఓ భామా
సమయానికి తగు మాటలు నేర్చిన
సరసురాలవే ఓ భామా
ఇపుడేమన్నా ఒప్పునులే
ఇక ఎవరేమన్నా తప్పదులే

ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ
ప్రియురాల సిగ్గేలనే
నీ మనసేలు మగవానిజేరి..ఈ
ప్రియురాల సిగ్గేలనే

వీరాభిమన్యు చిత్రంలో కన్నయ్య గురించిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : వీరాభిమన్యు (1965)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : జానకి బృందం

కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా 
ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 

నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
మద్దుల గూల్చిన వాడా ముసలెద్దుని చంపిన వాడా
కొంటె కృష్ణా రారా గోపీ కృష్ణా రా రా అనాథ కృష్ణా.. 
కృష్ణా రా కృష్ణా రా రారారా 
కన్నెల దొంగ వెన్నల దొంగ దారుల దొంగ చీరల దొంగా 
అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా 

కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 
వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా 

శ్రీకృష్ణుడు తన మాటలకు కట్టుబడి ఉండే భార్యా విధేయుడు అనుకునే సత్యభామ ధీమాను ఈ పాటలో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడడౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : జానకి

మాట మీరగలడా..నేగీచిన గీటు
దాటగలడా..సత్యాపతి
మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా..ఆ
మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా

పతివలపంతా..నా వంతేనని
సవతుల వంతు..రవంత లేదనీ
పతివలపంతా..నా వంతేనని  
సవతుల వంతు..రవంత లేదనీ
రాగ సరాగ..వైభోగ లీలలా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాగ సరాగ..వైభోగ లీలలా
సరస కేళి..తేల్చే సాత్రాజితి

మాట మీరగలడా..నేగీచిన గీటు
దాటగలడా సత్యాపతి..మాట మీరగలడా..ఆ

నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నారీ లోకము..ఔరా యనగా
నా సవతులు గని తలలు వంచగా
వ్రతము నెరపు దానా ఆ మీదట మాట మీరగలడా

మాట మీరగలడా..నేగీచిన గీటు
దాటగలడా..సత్యాపతి..మాట మీరగలడా..ఆ

భక్త జయదేవ చిత్రంలోని ఒక మనోహరమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట  ఆడియోఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భక్త జయదేవ (1961)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల

ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నీ మధుమురళీ గానలీల
నీ మధుమురళీ గానలీల
మనసును చివురిడురా కృష్ణా...
నీ మధుమురళీ గానలీల
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నీ మధుమురళీ గానలీల

యమునా తటమున
మోడులు మురిసీ
యమునా తటమునా... ఆ...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
యమునా తటమున
మోడులు మురిసి
పువులు పూచినవి గోపాలా...

నీ మధుమురళీ గానలీల
మనసును చివురిడురా కృష్ణా...
నీ మధుమురళీ గానలీల

మప ససససససససస
నిరిసస నిరిసస నిససస నిరిరిరి
నిససస నిరిరిరి నిసస నిరిరి
నిసస నిరిరి
నిసదప మపనిస రిసదప
మపసనిదప మదపప
గమరిసనిస... ఆ...ఆ.ఆఅ.
ఆఆ.ఆఅ.ఆ.ఆఆఅ..ఆఆ...

శ్రీకృష్ణ పాండవీయం చిత్రంకోసం పి.బి.శ్రీనివాస్ గానం చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1965)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సముద్రాల సీనియర్ 
గానం : పి.బి.శ్రీనివాస్ 

కృష్ణా యదుభూషణా
శ్రీ కృష్ణా యదుభూషణా
గోవిందా ముకుందా హే పావనా 
కృష్ణా యదుభూషణా

దీనుల పాలిటి దైవము నీవట 
అమరులనేలెడి అయ్యవు నీవట 
దీనుల పాలిటి దైవము నీవట 
అమరులనేలెడి అయ్యవు నీవట
భక్త కోటికి చింతామణివట... ఆఆ..ఆఅ..ఆ
భక్త కోటికి చింతామణివట
నిను నెరనమ్మిన లోటే రాదట 

కృష్ణా యదుభూషణా

అఖిలమునెరిగిన అంతర్యామికి 
వివరించే పని లేదుగదా 
అఖిలమునెరిగిన అంతర్యామికి 
వివరించే పని లేదుగదా
నమ్మిన కొమ్మను ఏలుకొమ్మనీ
కృష్ణా..ఆఆఅ..ఆఅ..ఆఆఅ... 
నమ్మిన కొమ్మను ఏలుకొమ్మనీ
రమ్మని పిలచుట నాభాగ్యమెగా 

కృష్ణా యదుభూషణా
గోవిందా ముకుందా హే పావనా 
కృష్ణా యదుభూషణా
హే కృష్ణా యదుభూషణా