శ్రీదేవి సిత కమలాలయా..


చిత్రం : దేవాంతకుడు (1960)
సంగీతం : అశ్వత్థామ
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.లీల, కోరస్

శ్రీదేవి సిత కమలాలయా
శ్రీదేవి సిత కమలాలయా 
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
శ్రీదేవి సిత కమలాలయా 
 
పసుపు కుంకుమలతో వసుధలో జీవించ 
వరమిచ్చి వాటితో దరి చేర్చినావు ఆఆఆ...ఆఆ..
వరమిచ్చి వాటితో దరి చేర్చినావు 
పెనిమిటి ఒడిలోన తనువు వీడుట కన్నా 
మహిళ పూజా ఫలము మరి వేరు లేదమ్మా.. 

శ్రీదేవి సిత కమలాలయా 
 
దివి చేరినా ఆ భువిలోన జీవించు 
పతిమేలు కోరుటే సతి ధర్మమమ్మా..ఆఆఆ.. 
పతిమేలు కోరుటే సతి ధర్మమమ్మా
కరుణించి పాలించి తరగని సిరులిచ్చి 
ధరలోన గల మా మగవారి బ్రోవుమా 

శ్రీదేవి సిత కమలాలయా
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
శ్రీదేవి సిత కమలాలయా 


0 comments:

Post a Comment