WHAT'S NEW?
Loading...

కలల మహరాజు

చిత్రం : భాషా (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
నచ్చిన వాడే నా ఆశే తీరగ వచ్చెనిలా
వెలిగేనమ్మా నా కన్నుల చల్లని వెన్నెలలే
గంగై నా మది పొంగేనే దిగిరా నా జతనీవే..

కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

రావే కలవాణీ నీవేలే అలివేణీ
మదినేలీ అలరించే మారాణీ ప్రేమల మాగాణీ 
నీవే రాజువనీ వలచినదీ పూబోణీ 
మదిలో అనురాగం విరబూయగ చేరే మహరాణీ
తరించేటి మోజే ఫలించాలి నేడూ 
తాపాలు తీరే విలాసాలు చూడూ 
ఇది కలరవమా తొలి కలవరమా

కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

తోడై వచ్చాడే మది నాకే ఇచ్చాడే 
నీడై నను కాచే మొనగాడే జతగా దొరికాడే 
ముద్దుల మురళి వినీ ఎద పొన్నై పూచిందీ 
పాటే విరితోటై సిరిపైటే స్వాగతమిచ్చిందీ 
నామేని వీణా శృతి చేసుకోరా 
తాపాలలోనా జత చేరుకోనా 
ఏ విందుకనీ ఈ తొందరలు 

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
నచ్చిన వాడే నీ ఆశే తీరగ వచ్చెనిలా
వెలిగేనమ్మా నీ కన్నుల చల్లని వెన్నెలలే
మోహంలో మది గంగై పొంగెనుగా నా జతనీవే..

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

0 comments:

Post a Comment